ఆస‌క్తిక‌రంగా ఉన్న 'పేప‌ర్ బాయ్' ట్రైల‌ర్

Sat,August 18, 2018 10:32 AM
Paper Boy Theatrical Trailer released

ర‌వితేజ‌, రామ్ చ‌ర‌ణ్ , గోపి చంద్ వంటి స్టార్స్‌తో హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన సంప‌త్ నంది నిర్మాత‌గా మారి పేప‌ర్ బాయ్ అనే సినిమాని నిర్మించాడు. సొంత నిర్మాణ సంస్థ‌లో తొలిసారి గాలిప‌టం అనే సినిమా చేసిన సంప‌త్ ఇప్పుడు త‌న బ్యాన‌ర్‌లో రెండో సినిమా సిద్దం చేశాడు. సెప్టెంబ‌ర్ 7న సినిమా విడుద‌ల కానుంది. త‌ను నేనులో నటించిన సంతోష్ శోభ‌న్ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. రియా సుమ‌న్‌, తాన్యా హోపేలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాతో జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బేన‌ర్‌లో రూపొందిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ఆడియో వేడుక జ‌రుపుకోనుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. భీమ్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో పాటు కెమెరా ప‌నితనం కూడా బాగుంది. హీరో, హీరోయిన్స్ మ‌ధ్య రొమాన్స్ బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమా కూడా ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీలా ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు . సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థాక‌థ‌నం అందించ‌డం విశేషం. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS