బీటెక్ చేసి న్యూస్ పేప‌ర్ వేస్తున్నావా- టీజ‌ర్

Sat,July 21, 2018 11:11 AM
Paper Boy Official Teaser released

ర‌వితేజ‌, రామ్ చ‌ర‌ణ్ , గోపి చంద్ వంటి స్టార్స్‌తో హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన సంప‌త్ నంది నిర్మాత‌గా మారి పేప‌ర్ బాయ్ అనే సినిమాని నిర్మించాడు. సొంత నిర్మాణ సంస్థ‌లో తొలిసారి గాలిప‌టం అనే సినిమా చేసిన సంప‌త్ ఇప్పుడు త‌న బ్యాన‌ర్‌లో రెండో సినిమా సిద్దం చేశాడు. త‌ను నేనులో నటించిన సంతోష్ శోభ‌న్ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. రియా సుమ‌న్‌, తాన్యా హోపేలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బేన‌ర్‌లో రూపొందిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ఆడియో వేడుక జ‌రుపుకోనుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు.

భీమ్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో పాటు కెమెరా ప‌నితనం కూడా బాగుంది. టీజ‌ర్‌లో హీరోయిన్ బీటెక్ చేసి న్యూస్ పేప‌ర్ వేస్తున్నావా అని హీరోని ప్ర‌శ్నించ‌గా అది బ‌త‌క‌డం కోసం, ఇది భ‌విష్య‌త్ కోసం అని చెబుతాడు. ఈ డైలాగ్‌ సినిమా డెప్త్‌ని తెలియజేస్తున్నది. సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థాక‌థ‌నం అందించ‌డం విశేషం. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

4894
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles