ఆ ద‌ర్శ‌కుడి నిర్మాణంలో మ‌రో సినిమా

Thu,June 8, 2017 03:25 PM
paper boy movie launched today

వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తున్న ద‌ర్శ‌కులు ఒక వైపు మంచి చిత్రాలు తెర‌కెక్కిస్తూనే మ‌రో వైపు త‌మ నిర్మాణంలో వైవిధ్య‌మైన సినిమాలు రూపొందిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ తో ర‌చ్చ , ర‌వి తేజ‌తో బెంగాల్ టైగ‌ర్ వంటి సినిమాలు తీసి మంచి విజ‌యాలు అందుకున్న సంప‌త్ నంది ప్ర‌స్తుతం గౌత‌మ్ నంద అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. గోపి చంద్, హ‌న్సిక మ‌రియు కేథ‌రిన్ థెస్రా ప్ర‌ధానా పాత్ర‌ల‌లో ఈ మూవీ రూపొందుతుంది. అయితే ఒక‌వైపు ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్న సంప‌త్ నంది మ‌రో వైపు ఆయ‌న ఓన్ బేన‌ర్ సంప‌త్ నంది క్రియేటివ్ వ‌ర్క్స్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ బేన‌ర్ పై గాలిప‌టం అనే చిత్రం 2014లో రూపొందింది. ఇప్పుడు తాజాగా పేప‌ర్ బాయ్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. సంప‌త్ నంది, వెంక‌ట్ , న‌ర‌సింహ సంయుక్తంగా నిర్మిస్తున్న పేప‌ర్ బాయ్ చిత్రం ఈ రోజు పూజా కార్య‌క్రమాల‌తో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్రమానికి గోపిచంద్, కేథ‌రిన్ , జె.భ‌గ‌వాన్, పుల్లా రావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుండ‌గా సంతోష్ శోభ‌న్ , ఐశ్వ‌ర్య వ‌క్త‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. జ‌య శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా , సంప‌త్ నంది స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించ‌నున్నాడు.

860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles