మంచి వసూళ్లు రాబడుతున్న ‘పందెంకోడి 2’

Tue,October 23, 2018 04:12 PM
pandemkodi 2 collects Highest collections in Chennai

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన పందెంకోడి 2 చిత్రం బాక్సాపీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తనదైన వసూళ్లతో దూసుకెళ్తోంది. పందెం కోడి2 కేవలం చెన్నైలోనే 2.2 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు విశాల్ సినిమాల్లో ఇదే అత్యధిక కలెక్షన్ రికార్డు. మరోవైపు రెండు తెలుగు రాష్ర్టాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్‌గా నటించింది. 2005లో వచ్చిన పందెం కోడి చిత్రానికి ఇది సీక్వెల్.

3360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles