పందెం కోడి 2 నుండి ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల‌

Sun,October 7, 2018 07:57 AM
Pandem Kodi 2 Sivangi Pilla Telugu Lyrical video

విశాల్‌, మీరా జాస్మిన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన పందెం కోడి చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా పందెం కోడి 2 తెర‌కెక్కింది. త‌మిళంలో ఈ చిత్రం సంద‌కోళి 2 పేరుతో విడుద‌ల కానుంది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించింది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ లేడి విల‌న్‌గా క‌నిపించ‌నుంది. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై విశాల్‌, ధావల్‌ జయంతిలాల్‌, అక్షయ్‌ జయంతిలాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లై మంచి రెస్పాన్స్ సాధించింది. ట్రైల‌ర్‌లో విశాల్ ర‌ఫ్ఫాడించగా, కీర్తి సురేష్ త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. లేడి విల‌న్ గెట‌ప్‌లో వ‌ర‌ల‌క్ష్మీ లుక్ కేక పుట్టించింది. జాతర లో పులి వేషాలు వేయొచ్చు..కానీ పులి ముందే వేషాలు వేయకూడదు అనే డైలాగ్ అదిరిపోయింది. ద‌స‌రా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే తాజాగా చిత్రానికి సంబంధించి తొలిసాంగ్ విడుద‌ల చేశారు. శివంగి పిల్ల అంటూ సాగే ఈ పాట అల‌రిస్తుంది. మీరు ఆ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

1763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles