ప్రియాంక భర్తతో పాకిస్తానీ నటి..

Tue,September 10, 2019 01:03 PM
Pakistani actress with Priyanka's husband ..

నూయార్క్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికాకు చెందిన ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారు ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఓ ఈవెంట్‌లో నిక్ ప్రియాంకతో కాకుండా పాకిస్తానీ నటి మెహ్విష్ హాయత్‌తో కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటోని హాయత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటో వెనుక గల కారణం వివరిస్తూ.. నేను, నిక్ జొనాస్ యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూడడానికెళ్లాం. రఫెల్ నాదల్ మా ఫేవరెట్ ఆటగాడు. అందుకే అతనికి ఛీర్స్ చెప్పడానికెళ్లాం. ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా నాదల్ గెలుస్తాడని మేమనుకున్నాం. అదే విధంగా జరిగింది. నాదల్ సెమీస్‌తో పాటు ఫైనల్లోనూ గెలిచి నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు.


అయితే ఈ ఫోటోకు గల ప్రత్యేకత ఏమంటారా..! ప్రియాంక చోప్రా, ఫోటోలో ఉన్న పాకిస్తానీ నటి గతంలో ఇండియా, పాకిస్తాన్ ఆర్మీ విషయంలో విమర్శలు చేసుకున్నారు. ఇండియాను సమర్థిస్తూ ప్రియాంక, పాక్‌ను సమర్థిస్తూ హాయత్ వాదోపవాదాలు చేసుకున్నారు. అందుకనే నెటిజన్స్ ఈ ఫోటోను కాస్త ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే నిక్ ప్రియాంక భర్త గనుక.

1772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles