ఇండియన్ సినిమాలు పాక్ లో నిషేదం ..!

Fri,May 25, 2018 04:28 PM
Pakistan Bans Screening Of Indian Films Temporarily for eid

పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రంజాన్ సందర్భంగా ఇండియన్, ఫారెన్ సినిమాలపై తాత్కాలిక నిషేదం విధించింది. ఈద్ కి రెండు రోజుల ముందు నుండి సెలవులు ముగిసిన రెండు వారాల తర్వాత వరకు భారత్ సహా విదేశాలకి చెందిన ఏ సినిమాని ప్రదర్శించకూడదని అక్కడి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానిక పరిశ్రమకి సంబంధించిన సినిమాలని ఎక్కువగా జనాలలోకి తీసుకెళ్ళేందుకు వారు తాత్కాలిక బ్యాన్ ని విధించినట్టు తెలుస్తుంది. ఇతర భాషల సినిమాల వలన స్థానిక సినిమాలకి థియేటర్స్ దొరక్కపోవడం, విడుదలైన సినిమాలకి సరైన ఆదరణ లభించకపోవడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు, నటీనటులు ఈ విషయంపై పాక్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట. దాంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారట. సల్మాన్ సినిమాలకి పాకిస్థాన్ లోను మంచి డిమాండ్ ఉంటుంది. ఈద్ కానుకగా రేస్ 3 విడుదల కానుండగా, ఈ సారి పాక్ లో సినిమా విడుదల కావడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరూత్సాహంతో ఉన్నట్టు టాక్.

1754
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS