రూల‌ర్ నుండి 'ప‌డ‌తాడు తాడు.. ఎవ‌డైన' వీడియో సాంగ్ విడుద‌ల‌

Sun,December 15, 2019 11:33 AM

నంద‌మూరి బాల‌కృష్ణ - కేఎస్ ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన‌ తాజా చిత్రం రూల‌ర్. డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న ఈ చిత్రం జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. శ‌నివారం సాయంత్రం వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర బృందంతో పాటు రాజ‌శేఖ‌ర్, జీవిత ప‌లువురు ఎమ్మేల్యేలు హాజ‌ర‌య్యారు. సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు ధీమా వ్య‌క్తం చేశారు. అయితే మ‌రో ఐదు రోజుల‌లో సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మూవీకి సంబంధించి ప‌లు వీడియో సాంగ్స్‌ని ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప‌డ‌తాడు తాడు.. ఎవ‌డైన అంటూ సాగే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో బాల‌య్య స్టెప్స్ , లుక్స్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో క‌నిపించ‌నుంది.

1428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles