త్రీడీలో కనువిందు చేయనున్న పద్మావతి !

Thu,October 26, 2017 03:41 PM
Padmavati to be released in 3D

న్యూఢిల్లీ: రాణి పద్మినీదేవి అందాలను చూసి ఆశ్చర్యపోతున్నారా. ఆమె ఆభరణాలకు అట్రాక్ట్ అయ్యారా. ఇప్పుడు ఆ అద్భుత సోయగాలను త్రీడీలోనూ వీక్షించే అవకాశం ఉంది. పద్మావతి ఫిల్మ్ ట్రైలర్‌ను చూసిన హాలీవుడ్‌కు చెందిన ప్యారామౌంట్ పిక్చర్స్ ఆ సినిమాను త్రీడీలో రిలీజ్ చేయాలని ప్లానేసింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న పద్మావతి ట్రైలర్‌కు హాలీవుడ సంస్థ క్లీన్‌బౌల్డ్ అయ్యింది. దాంతో ఆ సంస్థ ఈ సినిమాను త్రీడీలో చూపించాలని తహతహలాడుతున్నది. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వయాకామ్ 18కు ప్యారామౌంట్ సంస్థ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. డైరక్టర్ భన్సాలీ ఊహా వైభవాన్ని త్రీడీలో చూస్తేనే ఆ రాజసం ఉట్టిపడుతుందని ప్యారామౌంట్ పేర్కొన్నట్లు సమాచారం. రాణి పద్మినిగా దీపికా పదుకునే నటిస్తున్నది. ఈ ఫిల్మ్ డిసెంబర్ 1న విడుదలకానున్నది.

3441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles