‘ప్యాడ్‌మాన్’ మూవీకి అరుదైన గౌరవం

Thu,January 18, 2018 06:34 PM
padman will be 1st indian movie to be screening at Oxford Union


ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన ‘ప్యాడ్‌మాన్’ మూవీ అత్యంత అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఆక్స్‌ఫడ్ యూనియన్ చర్చా సంఘం సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై చర్చించాల్సిందిగా నిర్మాత ట్వింకిల్ ఖన్నాను ఆహ్వానించింది. ప్యాడ్‌మాన్ అంశంపై జనవరి 18న యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి చర్చాగోష్టిగా పాల్గొనాలని..ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ట్వింకిల్ ఖన్నాను కోరింది. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్ స్పందిస్తూ..ప్యాడ్‌మాన్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించడం ప్రారంభమైందని ట్వీట్ చేశాడు. అతి తక్కువ ధర కలిగిన సానిటరీ ప్యాడ్ మేకింగ్ యంత్రం ఆవిష్కర్త అరుణాచలం మురుగనంతం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ప్యాడ్‌మాన్‌లో రాధికాఆప్టే, సోనమ్‌కపూర్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో ప్రదర్శించనున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కనుంది ప్యాడ్‌మాన్.

1555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles