ప్యాడ్ మాన్: పురుషుల‌కి నో ఎంట్రీ

Sun,February 18, 2018 10:34 AM
padman no entry for male

శానిటరీ ప్యాడ్ సృష్టిక‌ర్త అరుణాచలమ్‌ మురుగనాథమ్ జీవిత క‌థ ఆదారంగా తెర‌కెక్కిన చిత్రం ప్యాడ్‌మాన్‌. అక్ష‌య్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వరి 9న గ్రాండ్‌గా విడుద‌లైంది. ఆర్ బాల్కీ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. సామాజిక స్పృహ క‌లిగించే విధంగా రూపొందిన ఈ చిత్రాన్ని పురుషుల‌తో క‌లిసి చూసేందుకు మ‌హిళ‌ల‌కి కొంత ఇబ్బందిగా ఉన్న‌ట్టు గ్ర‌హించింది కోల్‌కతాలోని పీవీఆర్ మల్టిప్లెక్స్. కొంద‌రు ఆక‌తాయిలు సినిమా చూస్తున్నంత సేపు అనుచిత కామెంట్స్ చేయ‌డం, వారిని కించ‌ప‌రిచేలా మాట్లాడ‌డం చేస్తుండడంతో రోజులో ఒక షోని కేవ‌లం మ‌హిళ‌ల కోస‌మే ప్ర‌ద‌ర్శించాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం భావించింద‌ట‌. ప్ర‌తి రోజు మధ్యాహ్నం షోను ప్రత్యేకించి మహిళల కోసమే ప్రదర్శిస్తున్నారు. ఈ షోకు ఎట్టిపరిస్థితిలో పురుషులకు ప్రవేశం లేదని పీవీఆర్ డైమండ్ ప్లాజా డ్యూటీ ఆఫీసర్ సమీర్ ఖాన్ అన్నారు. శానిట‌రీ ప్యాడ్‌పై అందరిలో అవ‌గాహ‌న క‌లిపించేందుకు అనేక మంది సెల‌బ్రిటీలు ప్యాడ్‌మాన్ చాలెంజ్‌ని స్వీకరించిన సంగ‌తి తెలిసిందే.

2524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS