ఆజమ్ ఖాన్ ఓ ఖిల్జీ : జయప్రద

Sat,March 10, 2018 12:43 PM
Padmaavats Khilji character reminded me of Azam Khan, says Jaya Prada

హైదరాబాద్: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ నేత ఆజమ్ ఖాన్ తనను వేధించేవారని ఆమె ఆరోపించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆజమ్ ఖాన్ వేధింపులకు పాల్పడేవారన్నారు. పద్మావత్ చిత్రంలో ఉన్న ఖిల్జీ పాత్రతో ఆజమ్ ఖాన్‌ను పోల్చారామె. యూపీలోని రాంపూర్ ఎంపీ నియోజకవర్గం నుంచి జయప్రద పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకు ఆ నియోజకవర్గం నుంచే ఆమె గెలుపొందారు. అయితే అదే రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆజమ్ ఖాన్ 9 సార్లు ఎన్నికయ్యారు. ఆజమ్ ఖాన్‌ది సమాజ్‌వాదీ పార్టీ కాగా, జయప్రదది రాష్ట్రీయ్ లోక్‌దళ్. 2009లో జరిగిన ఎన్నికల సమయంలో ఆజమ్ ఖాన్‌పై జయప్రద ఫిర్యాదులు చేసింది. తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఆజమ్ ప్రయత్నిస్తున్నారని ఆమె గతంలో ఆరోపించారు. అయితే ఇవాళ జయప్రద ఆ ఆరోపణలను మరోసారి దృవీకరించింది. పద్మావతి సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఖిల్జీ క్యారెక్టర్.. ఆజమ్ ఖాన్‌ను గుర్తు చేసిందని జయప్రద అన్నారు. ఎన్నికల సమయంలో మార్ఫింగ్ చేసిన సీడీలను ఆజమ్ ఖాన్ సరఫరా చేశారని జయప్రద ఆరోపించారు.3688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles