పాకిస్థాన్‌లో పద్మావత్‌కు గ్రీన్‌సిగ్నల్

Thu,January 25, 2018 01:15 PM
Padmaavat given green signal for release in Pakistan

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ మూవీపై ఓవైపు ఇండియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ దేశవ్యాప్తంగా సినిమా రిలీజైనా.. హింస ఎక్కువగా ఉన్న ఆ నాలుగు రాష్ర్టాల్లో మాత్రం సినిమాకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు పాకిస్థాన్‌లో మాత్రం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించడం గమనార్హం. అక్కడి సీబీఎఫ్‌సీ సినిమా రిలీజ్‌కు క్లియరెన్స్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా సినిమా రిలీజ్‌కు అనుమతి ఇచ్చినట్లు సీబీఎఫ్‌సీ సభ్యుడు మొబషిర్ హసన్ తెలిపారు. అంతేకాదు ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. అల్లావుద్దీన్ ఖిల్జీని విలన్‌గా చూపించారంటూ పాకిస్థాన్‌లో చాలా మంది మూవీని వ్యతిరేకించారు. అయితే కళలు, సృజనాత్మకత, వినోదం విషయంలో సీబీఎఫ్‌సీ ఎలాంటి వివక్ష చూపబోదని హసన్ స్పష్టంచేశారు. పూర్తి నిబంధనల ప్రకారమే ఈ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చినట్లు చెప్పారు. దీనికోసం ఖ్వాయిదె ఆజం యూనివర్సిటీకి చెందిన చరిత్రకారుడు, ప్రొఫెసర్ వకార్ అలీ షా సాయం తీసుకున్నట్లు హసన్ తెలిపారు. ఓటింగ్‌లో ఆయనకు ఎలాంటి హక్కు లేకపోయినా.. ఆయన అభిప్రాయం మేరకు సినిమాకు క్లియరెన్స్ ఇచ్చినట్లు చెప్పారు.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles