తైపీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు పద్మావత్

Tue,October 23, 2018 08:45 AM
Padmaavat film officially selected at 2018 Taipei Golden Horse Film Festival

ముంబై: బాలీవుడ్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తీసిన పద్మావత్ ఫిల్మ్... తైపి ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజైన విషయం తెలిసిందే. తైపి గోల్డెన్ హార్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ ఏడాది పద్మావత్ సినిమా ఎంపికైనట్లు ఆ చిత్ర నిర్మాతలు తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తైపి ఫిల్మ్ ఫెస్టివల్‌కు సినిమా ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాలో రాణి ప‌ద్మిని పాత్రలో దీపికా నటించింది. షాహిద్ కపూర్ ఈ ఫిల్మ్‌లో మహా రావల్ రతన్ సింగ్ పాత్రలో నటించగా, అల్లహుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించారు. రాజ్‌పుత్ సంఘాలు ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకున్న విషయం తెలిసిందే.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles