పద్మావత్ @ 500 కోట్లు

Tue,February 20, 2018 03:02 PM
Padmaavat box office crosses Rs.500 Crores

హైదరాబాద్ : డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తీసిన పద్మావత్ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దులుకొడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిల్మ్ కలెక్షన్లు రూ.500 కోట్లు దాటేశాయి. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. పద్మావత్ ఫిల్మ్‌లో రాణి పద్మావతిగా దీపికా పదుకునే నటించింది. ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ నటించాడు. ఈ ఫిల్మ్ విడుదలపై కొన్ని రాష్ర్టాల్లో నిరసనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. అయితే జనవరి 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2, దంగల్ నెలకొల్పిన రికార్డులను అందుకునే దిశగా పద్మావత్ పయనిస్తున్నది. 1540లో సూఫీ కవి మాలిక్ మొహమ్మద్ జయసీ రాసిన పుస్తకం ఆధారంగా పద్మావత్‌ను తెరకెక్కించారు. మహారావల్ రతన్ సింగ్ పాత్రను షాహిద్ కపూర్ పోషించాడు. గుజరాత్, రాజస్థాన్, రాష్ర్టాల్లో ఈ ఫిల్మ్ రిలీజ్‌కాలేదు.2649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles