పద్మావత్‌కు క్లియరెన్స్ ఇవ్వని మలేషియా సెన్సార్ బోర్డు

Mon,January 29, 2018 06:11 PM
Padmaavat banned in Malaysia by censor board

న్యూఢిల్లీ: పద్మావత్‌కు మరో కష్టం ఎదురైంది. ఆ ఫిల్మ్‌కు మలేషియాలో సెన్సార్ క్లియరెన్స్ దక్కలేదు. ఇస్లాం మతానికి సంబంధించిన సున్నితమైన అంశాలు ఆ ఫిల్మ్‌లో ఉన్నందున్న దానికి సెన్సార్ ఇవ్వడం లేదని ఆ దేశ బోర్డు స్పష్టం చేసింది. అతికష్టం మీద భారత్‌లో సెన్సార్ అనుమతి పొందిన పద్మావత్‌కు ఇప్పుడు మలేషియాలో అనూహ్యంగా కష్టాలు ఎదురయ్యాయి. తమ దేశ ముస్లింపై ఆ ఫిల్మ్ ప్రభావం చూపే అవకాశం ఉందని మలేషియా సెన్సార్ బోర్డు చైర్మన్ అబ్దుల అజీజ్ తెలిపారు. పద్మావత్ స్టోరీలైన్ ఇస్లాం మత సున్నిత అంశాలను టాచ్ చేసిందని, దాని వల్ల ఆ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. వివాదాల మధ్య ఈనెల 25వ తేదీన ఇండియాలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లు ఆర్జించింది.

1643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles