అంద‌మైన రొమాంటిక్ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

Fri,December 14, 2018 12:36 PM
Padi Padi Leche Manasu Theatrical Trailer

శ‌ర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం పడి పడి లేచే మనసు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. . డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు . తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ని చాలా చ‌క్క‌గా చూపించారు ద‌ర్శ‌కుడు. ఈ రొమాంటిక్ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని యూనిట్ చెబుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి డాక్టర్‌గా, శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాతో శ‌ర్వా, సాయిప‌ల్ల‌విలు మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోనున్నార‌ని తెలుస్తుంది.

1467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles