మ‌హ‌ర్షి నుండి పాల‌పిట్ట సాంగ్ వీడియో విడుద‌ల‌

Wed,May 22, 2019 09:55 AM
Paalapitta Video Song released

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, గాడ్జియ‌స్ బ్యూటీ పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్రం మ‌హ‌ర్షి. బాక్సాఫీస్ దగ్గ‌ర మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రానికి సంబంధించి మేక‌ర్స్ ప‌లు వీడియోలు విడుద‌ల చేస్తూ అభిమానుల‌లో ఆనందం నింపుతున్నారు. నిన్న చిత్ర మేకింగ్ వీడియో విడుద‌ల చేసిన టీం తాజాగా పాల పిట్ట అనే సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల చేసింది. ఇందులో మ‌హేష్‌, పూజా హెగ్డేల నృత్యం ప్రేక్ష‌కుల‌ని మంత్ర‌ముగ్దుల‌ని చేసింది. దేవి శ్రీ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ సాంగ్‌కి శ్రీమ‌ణి లిరిక్స్ అందించ‌గా, రాహుల్ సిప్లిగంజ్, మాన‌సి ఆల‌పించారు. మ‌హ‌ర్షి చిత్రంలో అల్ల‌రి న‌రేష్‌, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, జ‌య‌సుధ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

1737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles