మ‌హ‌ర్షి పాల‌పిట్ట సాంగ్ మేకింగ్ వీడియో

Thu,June 20, 2019 08:20 AM
Paala Pitta Song Making video

మ‌హేష్ బాబు- వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రూపొందిన మ‌హ‌ర్షి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు వంద‌ల కోట్ల మార్క్ ద‌గ్గ‌ర‌కి చేరుకున్న ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది.. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో మ‌హ‌ర్షిని మించిన సినిమా లేక‌పోవ‌డంతో ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌డుతుంద‌ని అంటున్నారు. అయితే చిత్రంపై జ‌నాల‌లో ఆసక్తిని క‌లిగించేందుకు తాజాగా పాల పిట్ట సాంగ్‌ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియో అభిమానుల‌ని అల‌రిస్తుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషించాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. త్వ‌ర‌లో అనీల్ రావిపూడితో క‌లిసి త‌న 26వ సినిమా చేయ‌నున్నాడు మ‌హేష్.

1277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles