తాను బ్ర‌తికే ఉన్న‌ట్టు చెప్పుకున్న‌ చంద్ర‌ముఖి ద‌ర్శ‌కుడు

Tue,January 16, 2018 05:05 PM
p. vasu clarifies about his death

ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా ప‌లువురు ప్ర‌ముఖ స్టార్స్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడే చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో ఎన్నో వ‌దంతులు వ్యాపించిన సంగ‌తి తెలిసిందే. ల‌య‌, వేణు మాధ‌వ్‌, కోట శ్రీనివాస రావు, చంద్ర‌మోహ‌న్ ఇలా ఒక‌రేంటి ఎంద‌రో సెల‌బ్రిటీలు చ‌నిపోయారని పుకార్లు షికారు చేయ‌గా, అవి అవాస్త‌వాల‌ని, వాటిని ఖండిస్తూ మీడియా ముందుకి వ‌చ్చిన సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. తాజాగా చంద్ర‌ముఖి ద‌ర్శ‌కుడు పి.వాసు చ‌నిపోయారంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై వాసు వెంట‌నే త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ వీడియో ద్వారా తాను బ్ర‌తికే ఉన్న‌ట్టు తెలిపారు. ‘ఆరు కిలోమీటర్లు వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్లగానే నేను చనిపోయానని వదంతులు వస్తున్న‌ట్లు వాట్సాప్‌లో త‌న‌కో సందేశం వచ్చిందని చెప్పిన వాసు, అది చూసి నవ్వుకున్నట్టు తెలిపాడు. ప్రజలకు త‌న‌పై ఇంత అభిమానం ఉందని తెలిసి సంతోషించాన‌ని పేర్కొన్నాడు. నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ ఏడాది మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను అంటూ త‌న ఆరోగ్యానికి సంబంధించి వ‌చ్చిన‌ వార్త‌ల‌ని ఖండించారు వాసు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో వాసు ప‌లు సినిమాలు చేసిన విష‌యం విదిత‌మే.

2463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS