మా ప్రయాణం త్వరలో ముగియనుంది..

Tue,February 7, 2017 05:42 PM
Our third journey comes to an end says Kabir khan


ముంబై: కబీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ హిట్ కాంబినేషన్‌లో ట్యూబ్‌లైట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కబీర్‌ఖాన్ తన అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ట్యూబ్‌లైట్ మూవీతో కొనసాగుతున్న మా మూడో ప్రయాణం త్వరలో ముగియనుంది. ప్రపంచానికి ఈ సినిమా చూపించేందుకు వెయిట్ చేయలేకపోతున్నానంటూ కబీర్‌ఖాన్ ట్వీట్ చేశాడు. సల్మాన్‌ను హగ్ చేసుకున్న ఫొటోతోపాటు చిత్రయూనిట్‌తో దిగిన సెల్ఫీని కబీర్‌ఖాన్ ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు. ట్యూబ్‌లైట్ మూవీ ప్రయాణంలో తనకు సహకరించిన చిత్ర యూనిట్ సభ్యులందరికీ కబీర్‌ఖాన్ ధన్యవాదాలు తెలిపాడు.

ట్యూబ్‌లైట్ మూవీని జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లడక్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో చిత్రీకరించారు. ఈ మూవీలో చైనీస్ హీరోయిన్ జూ జూ సల్మాన్‌కు జోడీగా నటిస్తుంది. ఈద్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్, కబీర్ కాంబినేషన్ లో వచ్చిన బజరంగీభాయ్ జాన్, ఏక్తా టైగర్ బాక్సాపీస్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే.

salmankabir3


2141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS