ఆస్కార్‌లో చేరిన కొత్త అవార్డ్‌.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నెటిజ‌న్స్

Thu,August 9, 2018 01:25 PM
Oscars to Add  Popular Film  Category, Creating Questions

ప్రపంచంలో అతి పెద్ద సినీ పండుగ ఏదంటే అందరికి గుర్తుకొచ్చేంది ఆస్కార్ అవార్డుల పండుగ . ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరో,హీరోయిన్సే కాక ప్రతీ టెక్నీషియన్ కూడా ఆస్కార్ అందుకోవాలని తహతహలాడుతుంటారు. లైఫ్ లో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అందుకుందామని కలలు కంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే ఆస్కార్ పండుగ ఈ సారి లాస్ ఏంజెల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవంగా జ‌రిగింది. 90వ ఆస్కార్ అవార్డుల పండుగ‌ని ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించారు నిర్వాహ‌కులు. వ‌చ్చే ఏడాది కూడా గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు స‌న్నాహ‌లు చేస్తున్న వారు ప్రతిష్టాత్మక అవార్డ్స్‌ల విభాగంలో ‘బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌’అనే కొత్త కేటగిరీని చేర్చిన‌ట్టు తెలియ‌జేశారు. 2020 నుండి ఈ కేట‌గిరి అందుబాటులోకి రానున్న‌ట్టు ది అకాడ‌మీ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. అంతేకాదు అదే ఏడాది ఫిబ్ర‌వరి 9న మ‌రో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తామ‌ని తెలుప‌గా , మూడు గంటలపాటు ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రసారం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై నెటిజ‌న్స్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఎంటీవీ అవార్డుల మాదిరిగా ఆస్కార్ అవార్డులు ఇవ్వాల‌నుకుంటున్నారా, బెస్ట్ పాపుల‌ర్‌గా ఒక మూవీని సెల‌క్ట్ చేస్తే మిగ‌తా కెటగిరీల‌లో ఉన్న‌ చిత్రాలని డీ గ్రేడ్ చేసిన‌ట్టే అవుతుందని అంటున్నారు.1525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles