షారూక్, మాధురీ, అనిల్ కపూర్‌లకు ఆస్కార్ ఆహ్వానం

Tue,June 26, 2018 03:03 PM


లాస్ ఏంజిల్స్ : ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా కొత్త సభ్యుల జాబితాను రిలీజ్ చేసింది. 59 దేశాలకు చెందిన 928 మంది కొత్త సభ్యులకు అకాడమీ ఆహ్వానం పలికింది. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను అకాడమీ అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా నుంచి ఆహ్వానం అందుకున్నవారిలో 20 మంది సినీ తారలు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్, మాధురి దీక్షిత్, అనిల్ కపూర్, టాబులు ఉన్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్, దేవదాస్ లాంటి చిత్రాల్లో షారూక్ నటించినట్లు అకాడమీ పేర్కొన్నది. బకెట్ లిస్ట్, దేవదాస్ లాంటి చిత్రాల్లో మాధురి దీక్షిత్ నటించిందన్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, తాల్ చిత్రాల్లో అల్ కపూర్ నటించారని అకాడమీ తెలిపింది. వీరితో పాటు మాజీ స్టార్స్ నషీరుద్దీన్ షా, సౌమిత్రా ఛటర్జీ, మధబీ ముఖర్జీలు ఉన్నారు. ఆస్కార్ అకాడమీకి ఆహ్వానం అందిన వారిలో ఫిల్మ్ నిర్మాతలు ఆదిత్య చోప్రా, గునీత్ మోంగాలు ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ల క్యాటగిరీలో మనీష్ మల్హోత్రా, డాలీ అహ్లూవాలియాలు ఉన్నారు. సినిమాటోగ్రఫీలో అనిల్ మొహతా, దేబజిత్ చాంగ్‌మాయ్, బిశ్వదీప్ ఛటర్జీలు ఉన్నారు. మ్యూజిక్ కంపోజర్లు స్నేహ కన్‌వాల్కర్, ఉషా కన్నాలు ఉన్నారు.

1570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles