రంగ‌స్థ‌లం నుండి ఓర‌య్యో సాంగ్ విడుద‌ల‌

Tue,April 3, 2018 08:17 AM
orayyo song releasd today

లెక్క‌ల మాస్టారు సుకుమార్ తెర‌కెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ రంగ‌స్థ‌లం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. అమెరికాలోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ‌, ప్ర‌కాశ్ రాజ్‌ల ప‌ర్ఫార్మెన్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం మూవీని ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది. ఈ మూవీ ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుండ‌గా, మూవీపై మ‌రింత అంచ‌నాలు పెంచేందుకు మేక‌ర్స్ ఈ రోజు సాయంత్రం ఓర‌య్యో అనే సాంగ్ విడుద‌ల చేయ‌బోతున్నారు.

సినిమా రిలీజ్‌కి ముందు ఐదు సాంగ్స్‌తో అల‌రించిన టీం ఈ రోజు సాయంత్రం 5 గం.ల‌కి దేవి శ్రీ స‌మ‌కూర్చిన ఓర‌య్యో సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు. ఆది చ‌నిపోయిన టైంలో వ‌చ్చిన ఈ సాంగ్ ప్ర‌తి ఒక్క‌రి కంట క‌న్నీరు పెట్టించింది. ఈ సాంగ్ కోసమే మ‌రోసారి సినిమా చూడాల‌నే ఉద్దేశంతో కూడా కొంద‌రు అభిమానులు ఉన్నారంటే ఈ సాంగ్ వారి హృద‌యాల‌ని ఎంత‌గా ట‌చ్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన‌ ఈ చిత్రానికి ర‌త్న‌వేలు సినిమ‌టోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. చిత్రంలోని అన్ని పాట‌ల‌కి చంద్ర‌బోస్ లిరిక్స్ అందించారు.

3925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles