స‌మ్మోహ‌నం సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల‌

Thu,June 14, 2018 08:56 AM
Oohalu Oorege Gaalanthaa Song Making video released

సుధీర్ బాబు, అదితీ రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ తెర‌కెక్కించిన చిత్రం సమ్మోహనం . జూన్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల‌ 10న ఫిలిం న‌గ‌ర్ జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ హాల్‌లో జ‌రిగింది . ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మ‌హేష్ బాబు హాజ‌రు అయ్యారు. చిత్ర బృందంకి బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తూ, మూవీ మంచి విజ‌యం సాధిస్తుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. శ్రీదేవి మూవీస్ బేన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఊహ‌లు ఊరేగే గాలంతా సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. వీడియోలో ద‌ర్శ‌కుడు సుధీర్ బాబు ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంసలు కురిపించారు. సుధీర్ బాబు కూడా ఈ సినిమా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు.చిత్ర క‌థానాయిక అదితి రావు హైద‌రి స‌మ్మోహ‌నం చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. చెలియా అనే డ‌బ్బింగ్ చిత్రంతో ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మే. మరి తాజాగా విడుద‌లైన మేకింగ్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles