సింగ‌ర్‌గా మార‌నున్న మ‌రో హీరోయిన్

Fri,June 14, 2019 08:26 AM
One More Star Heroine To Turn Singer

ప్ర‌స్తుతం హీరోయిన్స్ అంద‌రు మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టులుగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. న‌ట‌న‌తోనే కాకుండా త‌మ గానంతోను ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. కొందరు న‌టీ నటులైతే ప్రొఫెషనల్ వర్క్ అన్నట్టు అసలైన సింగర్స్ గా పాటలు పాడుతున్నారు. తాజాగా గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే గానంతో అల‌రించేందుకు సిద్ద‌మైంద‌ట‌. ప్ర‌స్తుతం పూజా .. అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. చిత్రానికి ఎస్ఎస్‌థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో ఓ సాంగ్‌ని పూజాచే పాడించాల‌ని థ‌మ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో ఆమెకి కొద్ది పాటి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. మ‌రి ఈ వార్తే నిజ‌మైతే ఇన్నాళ్ళు న‌టిగా అలరించిన పూజా సింగ‌ర్‌గాను ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంద‌న్న‌మాట‌.

2358
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles