గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన స్టార్ హీరోయిన్

Mon,March 25, 2019 12:10 PM

పై ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తు పట్టారా? అసలేమైనా పోలికలు కనిపిస్తున్నాయా? ఎప్పుడూ గ్లామరస్ రోల్స్ కనిపించే ఈ హీరోయిన్‌ను ఇలా చూడటం ఇదే తొలిసారి. అందుకే పోల్చుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. ఈమె దీపికా పదుకోన్. ఛపాక్ మూవీ కోసం దీపికా ఇలా మారిపోయింది. ఈ మూవీలో దీపికా.. యాసిడ్ బాధితురాలి పాత్రలో కనిపిస్తున్నది. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత చరిత్ర ఆధారంగా ఛపాక్ తెరకెక్కుతున్నది. ఈ మూవీకి సంబంధించి దీపికా ఫస్ట్ లుక్ ఇది. రాజీ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్‌ను ప్లే చేయడంతోపాటు సినిమా ప్రొడ్యూసర్ కూడా దీపికానే కావడం విశేషం. ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాలా ఈ ఫస్ట్ లుక్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత దీపికా కూడా ఇదే ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు దీపికా వెల్లడించింది. పద్మావత్ తర్వాత దీపికా నటిస్తున్న సినిమా ఇదే.
6273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles