వ‌న్ బాయ్ వ‌న్ గార్ల్ సాంగ్ మేకింగ్ వీడియో

Sat,March 30, 2019 11:15 AM
One Boy One Girl Song Making video

వివాహబంధంతో ఒక్కటైన తర్వాత నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. ఏప్రిల్ 5న చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. తాజాగా చిత్రం నుండి వ‌న్ బాయ్ వ‌న్ గార్ల్ సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో సాంగ్‌కి సంబంధించిన విశేషాల‌ని వెల్ల‌డించారు. గోపిసుంద‌ర్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్‌ని రేవంత్ ఆల‌పించ‌గా ఈ పాట‌కి భాస్క‌ర‌బ‌ట్ల లిరిక్స్ అందించారు. మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ . వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది.

1241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles