వ‌న్ బాయ్ వ‌న్ గార్ల్ అంటున్న నాగ చైత‌న్య‌

Fri,March 8, 2019 10:38 AM
One Boy One Girl Lyrical video released

వివాహబంధంతో ఒక్కటైన తర్వాత నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఈ టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఏప్రిల్ 5న చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. తాజాగా చిత్రం నుండి వ‌న్ బాయ్ వ‌న్ గార్ల్ అనే సాంగ్ విడుద‌ల చేశారు. రేవంత్ పాడిన ఈ పాట‌కి భాస్క‌ర‌బ‌ట్ల లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ . వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది . నాగచైతన్య, సమంత పాత్రలు, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles