వ్యవసాయ ప్రధానంగా శర్వానంద్ మూవీ..

Sat,August 24, 2019 05:29 PM
on agriculture based sharvanad movie

హైదరాబాద్: టాలీవుడ్‌లో విభిన్న కథలతో హిట్స్ అందుకున్న హీరో శర్వానంద్. ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేసే శర్వా ఈ మధ్యే విడుదలైన రణరంగం మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో శర్వా రైతుగా కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. వ్యవసాయ ప్రధానాంశంగా రూపుదిద్దుకునే ఈ సినిమాకు కిశోర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలౌతుంది. తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుగుతుంది. ఈ విషయంపై చిత్ర బృందం స్పష్టతనివ్వాల్సివుంది.

1439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles