ఓంకార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కుర్ర హీరో..!

Sat,January 13, 2018 11:29 AM
omkar next with young hero

బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయిన ఓంకార్ వెండితెరపై దర్శకుడిగా రాణిస్తున్నాడు. రాజు గారి గది అనే హరర్ కామెడీ ట్రాక్ తో తొలి హిట్ కొట్టిన ఓంకార్ దీనికి సీక్వెల్ గా నాగార్జున తో రాజు గారి గది 2 చేశాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ లభించిన ఓంకార్ డైరెక్షన్ కి ప్రశంసలు లభించాయి. అయితే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్లాసీ సబ్జెట్ ని ఓంకార్ ఎంచుకున్నాడనేది టాక్. ఇది క్రీడకి సంబంధించిన కథ కాగా ఇందులో కుర్ర బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించనున్నాడట. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్న శ్రీను త్వరలోనే ఈ మూవీని పూర్తి చేసి వెంటనే ఓంకార్ టీంతో కలవనున్నాడని అంటున్నారు. ఓంకార్- బెల్లంకొండ శ్రీనివాస్ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ మాస్ అంశాలతో పాటు కామెడీ సన్నివేశాల నేపధ్యంతో రూపొందనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

1317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS