సీనియ‌ర్ హీరోని డైరెక్ట్ చేయ‌నున్న‌ పాపుల‌ర్ యాంకర్

Wed,November 6, 2019 08:26 AM

ఒక‌ప్పుడు బుల్లితెరపై యాంక‌ర్‌గా రాణించి ఇప్పుడు వెండితెర‌పై అద్భుతాలు చేస్తున్నారు ఓంకార్‌. రాజుగారి గ‌ది చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన ఓంకార్ రీసెంట్‌గా రాజుగారి గ‌ది 3 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక త్వ‌ర‌లో సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌తో క‌లిసి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వెంకీ ప్ర‌స్తుతం వెంకీ మామ చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. చిత్రాన్ని ఓంకార్ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని ఓ టాక్ న‌డుస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. అసుర‌న్ చిత్రం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన సంగ‌తి తెలిసిందే.

1816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles