తమిళంలో రాబోతున్న నాగార్జున మూవీ!

Tue,August 15, 2017 01:11 PM
om namo venkatesaya released in kollywood

టాలీవుడ్ హీరోలకు సౌత్ లో మార్కెట్ రేంజ్ రాను రాను పెరుగుతోంది. సీనియర్ హీరోలు, యంగ్ హీరోల మూవీస్ తమిళం, మలయాళంలోకి డబ్ అవుతున్నాయి. తమిళనాడులో తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి తమిళంలో చాలా సినిమాలు డబ్ అవుతుంటాయి. లేటెస్ట్ గా నాగ్ న‌టించిన‌ మూవీని కూడా డబ్ చేసే ఏర్పాట్లలో ఉన్నారు. సాంఘిక చిత్రాల్లోనే కాక, భక్తిరస ప్రధానమైన సినిమాల్లో కూడా మెప్పిస్తున్న నాగార్జున సినిమాను కోలీవుడ్ లో రిలీజ్ చేయబోతుండ‌డం విశేషం.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ' ఓం నమో వేంకటేశాయ'. వేంకటేశ్వర స్వామికి మహా భక్తుడైన 'హథీ రామ్ బావాజీ' జీవితచరిత్రనే చలనచిత్రంగా తీశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్ బావాగా నాగార్జున ఈ సినిమాలో చక్కని నటనను కనబరిచాడు. ఈ సినిమాను డబ్ చేసి తమిళంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. అదివరకు అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు కూడా తమిళంలోకి అనువదించి విడుదల చేశారు.

హథీ రామ్ బావాజీ గురించిన చరిత్ర తమిళ ప్రజలకు తెలుసట. అందువలన ఈ సినిమాను అనువాదంగా అక్కడ విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ఆ ప్రయత్నాల్లో ఉందట. నాగార్జున సినిమా తమిళంలో డబ్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు నాగ్ నటించిన కొన్ని సినిమాలు తమిళంలో విడుదలయ్యాయి కూడా. అంతే కాదు .. 2015లో వచ్చిన ఇంజి ఇదుప్ప జగి అనే తమిళ మూవీలో నాగ్ ఓ చిన్న పాత్ర వేశాడట కూడా.

2326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles