‘ఒక్కడొచ్చాడు’ టీజర్ కి టైం ఫిక్స్

Wed,October 19, 2016 12:43 PM
okkadochadu  teaser release date fixed

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. సురాజ్ దర్శరత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో భారీ ఎత్తున కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ ఛేజ్‌ని చిత్రీకరించారు. అలాగే పాండిచ్చేరిలో భారీ సెట్స్‌ వేసి దినేష్‌ నృత్యదర్శకత్వంలో హీరో విశాల్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చాలా లావిష్‌గా చిత్రీకరించారు. ఇవేకాక విశాల్‌, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో భారీ సెట్స్‌ వేసి కోటి రూపాయల వ్యయంతో ఓ పాట తీశారు. ఇవి సినిమాకు చాలా ప్లస్ అవుతాయని యూనిట్ భావిస్తోంది. అయితే ఇటీవల ఈ చిత్ర ప్రీ టీజర్ ని విడుదల చేసిన యూనిట్ తాజాగా టీజర్ రిలీజ్ చేసేందుకు టైం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 21న టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఇక సినిమాను అక్టోబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్. ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తుండగా సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

1788
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles