‘ఒక్కడొచ్చాడు’కి టైం ఫిక్స్

Sun,October 23, 2016 08:30 AM
okkadochadu release date fixed

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. సురాజ్ దర్శరత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తెరకెక్కించగా నవంబర్‌ 18న గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 21న చిత్ర టీజర్ విడుదల కాగా ఈ టీజర్ కి ఇప్పటి వరకు 25 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. టీజర్‌కి అన్నిచోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విశాల్‌ కెరీర్‌లోనే ఒక్కడొచ్చాడు డిఫరెంట్‌ మూవీ అవుతుందని, ఇందులో యాక్షన్‌ వుంటూనే మంచి మెసేజ్‌ కూడా అందిస్తున్నాయని యూనిట్ తెలిపింది. చిత్రంలోని పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తీసారు. అవి సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్‌ అవుతాయని చిత్ర బృందం భావిస్తోంది.. నవంబర్‌ మొదటి వారంలో హిప్‌హాప్‌ అందించిన అద్భుతమైన సంగీతాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తుండగా సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

1359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles