డిఫరెంట్ గా ఉన్న విశాల్,తమన్నాల ప్రీ టీజర్

Fri,August 26, 2016 09:56 AM
Okkadochadu Pre Teaser   Tamannaah || Jagapati Babu

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. సురాజ్ దర్శరత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో భారీ ఎత్తున కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ ఛేజ్‌ని చిత్రీకరించారు. అలాగే పాండిచ్చేరిలో భారీ సెట్స్‌ వేసి దినేష్‌ నృత్యదర్శకత్వంలో హీరో విశాల్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చాలా లావిష్‌గా చిత్రీకరించారు. ఇవేకాక విశాల్‌, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో భారీ సెట్స్‌ వేసి కోటి రూపాయల వ్యయంతో ఓ పాట తీశారు. ఇవి సినిమాకు చాలా ప్లస్ అవుతాయని యూనిట్ భావిస్తోంది .

‘ఒక్కడొచ్చాడు’ సినిమాకు హిప్‌ ఆప్‌ సంగీతం అందించగా ఇది సినిమాకు మరింత ప్లస్ కానుందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తొలి టీజర్ ఆగస్ట్ 29న విశాల్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేయనుండగా.. అక్టోబర్‌ 9న ఆడియో, అక్టోబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తుండగా సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles