అందంగా ఉన్న ’ఒక మనసు’ థియేట్రికల్ ట్రైలర్

Thu,May 19, 2016 08:08 AM
Oka Manasu Movie Theatrical Trailer

రామరాజు దర్శకత్వంలో నాగశౌర్య, నిహారిక జంటగా నటించిన చిత్రం ఒక మనసు. మధుర శ్రీధర్, రవి ప్రకాశ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో వేడుక బుధవారం సాయంత్రం శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ పాటల వేడుక చాలా సరదాగా జరగగా సునీల్ కశ్యప్ సంగీతం మ్యూజిక్ ప్రియులను ఎంతగానో అలరించింది.

ఇటీవల ఒక మనసు చిత్రానికి సంబంధించి స్మాల్ టీజర్‌ని విడుదల చేసిన చిత్ర యూనిట్, నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్‌లో థీయేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేసి మూవీపై మంచి ఎక్స్‌పెక్టేషన్ పెంచారు.ఈ చిత్రంలో సంధ్య అనే డాక్టర్ పాత్రను నిహారిక పోషించగా, సూర్య అనే ఒక యువకుడిగా నాగశౌర్య కనిపించనున్నాడు. ఫీల్‌గుడ్ మూవీలా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.

3595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles