బాల్యంలోనే కోకోకోలా ప్ర‌క‌ట‌న‌లో న‌టించిన స్టార్స్

Thu,November 14, 2019 08:43 AM

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ సోష‌ల్ మీడియా ద్వారా అనేక విష‌యాలు అభిమానుల‌కి చేర‌వేస్తుంటారు. ఆ మ‌ధ్య క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డిన ఆయ‌న చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళారు. ఇటీవ‌ల ముంబై తిరిగి వచ్చారు. అయితే తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో అలనాటి కోకోకోలా ప్రకటనకు సంబంధించిన ఫొటో అని తెలిపారు. ఈ ఒరిజినల్ కోకోకోలా ప్రకటనలో బోనీ‌కపూర్, ఆదిత్య‌కపూర్, రిషి‌కపూర్, టూటూశర్మ, క్యూట్ అనిల్‌కపూర్ ఉన్నారన్నారు. చిన్న‌నాటి త‌మ స్టార్స్‌ని చూసి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.2250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles