అబ్ధుల్ క‌లాం బ‌యోపిక్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

Sun,May 12, 2019 08:00 AM
official announcement comes on abdul kalam biopic

బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హవా ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌యోపిక్ చిత్రాల‌కి ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు వివిధ రంగాల‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల బ‌యోపిక్స్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం బ‌యోపిక్ రూపొందించేందుకు బాలీవుడ్‌లో స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని త‌మ సంస్థ‌లో రూపొందించ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర , అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాట‌.

క‌లాం పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అనీల్ క‌పూర్ న‌టిస్తార‌ని టాక్‌. ఇటీవ‌ల అనీల్ క‌పూర్‌ని క‌లిసి స్క్రిప్ట్ వినిపించ‌గా, అది ఆయ‌న‌కు ఎంత‌గానో న‌చ్చ‌డంతో అబ్ధుల్ క‌లాం బయోపిక్‌లో న‌టించేందుకు ఈ బాలీవుడ్ స్టార్ ఎంతో ఉత్సాహంగా ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. వ‌చ్చే ఏడాది నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం రాజ్ చెంగప్ప వ్రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొంద‌నుంది. 83 ఏండ్ల వయస్సులో జూలై 2015న ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూ కలాం కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే .1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles