రొటీన్ టీజర్స్ కి డిఫరెంట్ గా మోహన్ లాల్ టీజర్

Fri,December 15, 2017 05:27 PM
Odiyan New Official Teaser

ఒక్క భాషకే పరిమితం కాకుండా ఎందరో అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న నటీనటులు కొందరు ఉంటారు. అందులో మోహన్ లాల్ ఒకరు. ఇటీవల జనతా గ్యారేజ్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు మోహన్ లాల్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న ఈయన ప్రస్తుతం వి.ఎ. శ్రీ కుమార్ దర్శకత్వంలో ఒడియన్ అనే మూవీ చేస్తున్నాడు. మంజు వారియర్ , ప్రకాశ్ రాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా కోసం మోహన్ లాల్ 50 రోజులలో 20 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరచారు.

ఒడియన్ అంటే ఓ కల్పిత జీవి. సగం మనిషి, సగం జంతువు రూపంలో ఉండి అతీంద్రియ శక్తులున్న ఈ జీవి రాత్రిపూట అడవులలో సంచరిస్తుందనేది కేరళలలోని మలబార్ ప్రాంత ప్రజల నమ్మకం. అలాంటి జీవి జీవిత కాలంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఒడియన్ సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ మాణిక్కన్ ఒడియన్ గా కనిపించనున్నాడు. ఇక తాజాగా చిత్ర టీజర్ విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. టీజర్ లో మోహన్ లాల్ ఓ ఫోటో ఫ్రేమ్ లోకి వచ్చి భారీ డైలాగ్స్ చెప్పి వెళ్లిపోతారు. ఈ టీజర్ కాస్త భిన్నంగా ఉండడంతో సినిమాపై జనాలలో ఆసక్తి పెరిగింది. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మరి ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

1742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS