'వ‌ర్మ' సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Sat,February 16, 2019 12:09 PM
October leading lady Banita Sandhu to star in Tamil remake

కోలీవుడ్‌లో అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్‌గా వ‌ర్మ అనే సినిమా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఆ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి త్వ‌ర‌లో ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు . ఈ చిత్రం ధృవ్ విక్ర‌మ్‌ ప్ర‌ధాన పాత్ర‌లోనే తెర‌కెక్క‌నుండ‌గా, ద‌ర్శ‌కుడితో పాటు చిత్ర న‌టీన‌టులు అంద‌రు కూడా మార‌తారు అని చెప్పుకొచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ‌. తాజాగా చిత్రంలో క‌థానాయిక‌గా అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందుని ఎంపిక చేశారు. ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్ త‌న‌ ట్విటర్‌ ద్వారా ఈ విష‌యం వెల్లడించారు. ఇక ద‌ర్శ‌కుడిగా అర్జున్‌ రెడ్డి సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన గిరీషయ్యని ఎంపిక చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. లేదంటే ఆ బాధ్య‌త గౌత‌మ్ మీన‌న్ తీసుకుంటార‌ని అంటున్నారు. కొత్త టీంతో రేయింబవళ్లు కష్టపడి ఈ సినిమా 2019, జూన్‌లో విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ త‌న‌ లేఖ‌లో తెలిపిన విష‌యం విదిత‌మే.1487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles