హౌజ్ నుండి నూతన్ ఔట్‌.. బాధ‌ప‌డ్డ ఇంటి స‌భ్యులు

Sat,August 18, 2018 08:40 AM
nutan naidu out from bigg boss

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 ప‌దోవారం చివరి ద‌శ‌కి చేరుకుంది. శుక్ర‌వారం జ‌రిగిన 69వ ఎపిసోడ్‌లో కెప్టెన్ ఎంపిక జ‌రిగింది. ముందుగా బిగ్ బాస్ కాల్ సెంట‌ర్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో అంద‌రు అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శించిన కార‌ణంగా ఒక్కొక్క‌రికి 200 పాయింట్స్ ఇచ్చారు బిగ్ బాస్ . దీంతో స్టోర్ రూంలో ఉన్న బోర్డుపై ఈ వారం త‌మ‌కి కావ‌ల‌సిన స‌రుకుల పేర్ల‌ని రాశారు ఇంటి స‌భ్యులు. ఆ త‌ర్వాత బిగ్ బాస్ కెప్టెన్ పోటిదారుని కోసం బిగ్ బాస్ కాల్ సెంట‌ర్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శించిన ఇద్ద‌రు పేర్లు చెప్పాల‌ని బిగ్ బాస్ సూచించారు. దీంతో కౌశ‌ల్, రోల్ రైడాకి ఎక్కువ ఓట్లు ప‌డ‌డంతో ఈ వారం కెప్టెన్ పోటీ దారులుగా కౌశ‌ల్‌, రోల్ రైడా సెల‌క్ట్ అయ్యారు.

కెప్టెన్ టాస్క్ కోసం ‘పడగొట్టు.. నిలబెట్టు’.. అనే చాలెంజింగ్ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ నిబంధ‌న ఏమంటే.. చ‌తుర‌స్రాకారంలో ఉన్న వాటితో పిర‌మిడ్ త‌యారు చేయాల‌ని , వాటిని రెండు గ్రూపులుగా విడిపోయిన ఇంటి స‌భ్యులు ప‌డ‌గొట్టాల‌ని అన్నారు. పిర‌మిడ్ ఆకారాన్ని ప‌డ‌గొట్టేందుకు స్మైలీ బాల్స్ ఇచ్చారు . ఇక ఈ టాస్క్‌కు పూజా సంచాలకురాలుగా వ్యవహరించారు. ‘పడగొట్టు.. నిలబెట్టు’ టాస్క్‌లో ఒక్క నూతన్ నాయుడు తప్ప మిగిలిన మేల్ కంటెస్టెంట్స్ తనీష్, గణేష్, సామ్రాట్, అమిత్‌లు ఒక జట్టుగా ఏర్పడి సునయన సాయంతో స్మైలీ బాల్స్‌తో కౌశల్‌పై మూకుమ్మడి దాడి చేశారు. ఇక నూతన్ నాయుడు, దీప్తి, గీతా మాధురి, శ్యామలలు రోల్ రైడాపై స్మైలీ బాల్స్ విసిరి వాళ్ల పిరిమిడ్‌ను పడగొట్టే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు.

రోల్ రైడా 76 బ్లాక్స్ తో పిర‌మిడ్ ఏర్పాటు చేయ‌గా, కౌశ‌ల్ 69 బ్లాక్స్ తో పిర‌మిడ్ త‌యారు చేశాడు. దీంతో సంచాల‌కురాలిగా ఉన్న పూజా రామ‌చంద్ర‌న్ కెప్టెన్ టాస్క్‌లో కౌశ‌ల్‌పై 7 పాయింట్ల తేడాతో రోల్ రైడా విజ‌యం సాధించిన‌ట్టు బిగ్ బాస్‌కి తెలియ‌జేసింది. బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్‌గా రోల్ రైడా ఎంపిక‌య్యాడ‌ని ప్ర‌క‌టించి వెంట‌నే బాధ్య‌త‌లు స్వీక‌రించమ‌ని చెప్పాడు. త‌ను ఓడిన కేవ‌లం అమ్మాయిల సాయంతో వారికి గ‌ట్టి పోటీ ఇచ్చినందుకు సంతృప్తి చెందాడు కౌశ‌ల్‌. అయితే కౌశ‌ల్‌కి స‌పోర్ట్‌గా ఉన్న నూత‌న్ నాయుడు.. రోల్ రైడా బ్లాక్స్ తో ఏర్పాటు చేసిన పిర‌మిడ్‌ని ప‌డ‌గొట్టే ప్ర‌య‌త్నంలో గాయ‌ప‌డ్డాడు. ఇంటి స‌భ్యులు వెంటనే నూత‌న్‌ని క‌న్ఫెష‌న్ రూంకి తీసుకెళ్ళారు.

క‌న్ఫెష‌న్ రూంలోకి వ‌చ్చిన డాక్ట‌ర్.. నూత‌న్ నాయ‌డు భుజాన్ని ప‌రీక్షించ‌గా, పెద్ద గాయం అని తెలుసుకొని వెంట‌నే హాస్పిట‌ల్‌కి తీసుకెళ్ళాల‌ని చెప్పారు. దీంతో ఇంటి స‌భ్యులు అంద‌రికి విష‌యాన్ని తెలియ‌జేస్తూ నూత‌న్ నాయుడు ల‌గేజ్‌ని స‌ర్ధి స్టోర్ రూంలో పెట్టాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. ఇక‌ నూత‌న్ నాయుడుని హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. రెండో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన నూత‌న్ నాయుడు ప్రేక్ష‌కుల స‌పోర్ట్‌తో ఇటీవ‌ల‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో త‌నేంటో ప్రూవ్ చేసుకుంటాన‌న్న నూత‌న్ నాయుడుకి ఇలా జ‌ర‌గ‌డంతో ఆయ‌న అభిమానులు తీవ్ర ఆందోళ‌నకి గుర‌య్యారు. ఇటీవ‌ల ఓ టాస్క్‌లోను కాలి గాయంతో నూత‌న్ బాధ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇంటి స‌భ్యులు మ‌రో 30 రోజులు మాత్ర‌మే బిగ్ బాస్ హౌజ్‌లో ఉండే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో నూత‌న్ నాయ‌డు మ‌ళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది స‌స్పెన్స్.

6608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS