నా స్టోరీ లైన్‌తో ఆ సినిమా తీశారు..

Sun,November 19, 2017 05:44 PM
నా స్టోరీ లైన్‌తో ఆ సినిమా తీశారు..


ముంబై: రవిజాదవ్ తెరకెక్కిస్తున్న మరాఠీ మూవీ ‘న్యూడ్’ తన షార్ట్ స్టోరీ లైన్‌తోనే తీశారని రచయిత్రి మనీశా కుల్‌శ్రేష్ట ఆరోపిస్తున్నారు. తాను రాసిన ‘కలింది’ స్టోరీని ఇతివృత్తంగా తీసుకుని న్యూడ్ చిత్రాన్ని రూపొందించారని మనీశా వెల్లడించారు. కథకు సంబంధించిన క్రెడిట్ గానీ, డబ్బుగానీ తమకు ఇవ్వడం లేదని..అందువల్లే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని మనీశా తెలిపారు. న్యూడ్ మూవీ టీంపై చట్టపరమైన తీసుకోవాలని పోరాటం చేస్తామని మనీశ్ కుల్‌శ్రేష్ట వెల్లడించారు. రవిజాదవ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన న్యూడ్ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.

2238

More News

VIRAL NEWS