యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్మీ ప్రణతి జూన్ 14న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. లక్ష్మీ ప్రణతి, ఎన్టీఆర్ దంపతులకి ఇప్పటికే అభయ్ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఉండగా, మరోసారి వారికి కుమారుడే పుట్టాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. బేబీ బాయ్ తో మా ఫ్యామిలీ పెద్దదైంది అంటూ ట్వీట్ చేశాడు. నందమూరి ఫ్యామిలీలోకి మరొకరు జాయిన్ కావడంతో ఆ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్టీఆర్‌కి కుమారుడు పుట్టాడని తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ చిన్న తనయుడిని ఎప్పుడెప్పుడు చూద్ధామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, సోషల్ మీడియాలో తారక్ చిన్న కొడుకు ఫోటో అంటూ ఓ పిక్ వైరల్ అయింది. ఇందులో క్యూట్‌గా కనిపిస్తున్న బుల్లి టైగర్ అచ్చం ఎన్టీఆర్‌లా ఉన్నాడని అంటున్నారు. అభిమానులు చిన్నారికి తారక్ 2.0 అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బని సెలక్ట్ చేసినట్టు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రాఘవ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని, అరవింద పాత్రలో పూజా హెగ్డే సందడి చేయనుందని సమాచారం. చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల కాగా ఇందులో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించి అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.
