నా సంతోషానికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు: ఎన్టీఆర్

Sat,July 22, 2017 04:32 PM
ntr son abhay ram birthday

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ మ‌ధ్య కొడుకు జ‌పం చేస్తున్నాడు. ఏ ఈవెంట్ కి వెళ్ళిన‌, ఏ అవార్డు ఫంక్ష‌న్ లో అయిన త‌న త‌న‌యుడు పేరు తీయనిదే స్పీచ్ ముగించ‌డు. అభ‌య్ పుట్టిన‌ప్ప‌టి నుండి త‌నలైఫ్ లో చాలా మార్పు వ‌చ్చింద‌ని ఎన్టీఆర్ ప‌లు మార్లు వ్యాఖ్యానించాడు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ ముద్దుల కుమారుడు అభ‌య్ పుట్టిన రోజు కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు, సెల‌బ్రిటీలు బ‌ర్త్ డే విషెస్ లు తెలియ‌జేస్తున్నారు. ఇక జూనియ‌ర్ మాత్రం త‌న కుమారుడితో బిగ్ బాస్ షో లో క‌లిసి ఉన్న ఫోటోని షేర్ చేసి నా సంతోషానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ ఆశీర్వాదాలు నా కుమారుడికి ఎప్పుడూ వరమే. అందరికీ ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు. అయితే ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఫోటోని బ‌ట్టి చూస్తుంటే బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఈ రోజు అభ‌య్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడ‌ని తెలుస్తుంది. ఈ బుల్లి స్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎన్టీఆర్ త‌న ఫ్యాన్స్ కి స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇస్తాడ‌ని టాక్.


4361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles