రాజ‌మౌళి ఫోటోపై ఎన్టీఆర్ కామెంట్

Wed,August 28, 2019 11:20 AM
ntr shares rajamouli pic

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం బ‌ల్గేరియాలో తాజా షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. చిత్ర లొకేష‌న్‌లో రాజ‌మౌళి ఏదో సీన్ గురించి డీప్‌గా ఆలోచిస్తుండ‌గా, ఆయ‌న‌ని త‌న కెమెరాలో బంధించిన ఎన్టీఆర్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోకి.. తుఫాను ముందు వ్య‌క్తి అనే క్యాప్ష‌న్ పెట్టారు. అంటే తుఫాను సృష్టించే ముందు రాజ‌మౌళి ఇంతే సైలెంట్‌గా ఉంటర‌ని ఎన్టీఆర్ త‌న కామెంట్‌తో చెప్ప‌క‌నే చెప్పారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్.. కొమురం భీం పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అల‌రించ‌నున్నాడు. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సముద్ర‌ఖ‌ని వంటి ప్ర‌ముఖులు చిత్రంలో భాగం కానున్నారు.

View this post on Instagram

The MAN before The STORM! #RRR

A post shared by Jr NTR (@jrntr) on

1867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles