అభ‌య్ నా క‌ళ్ళు మూయ‌డం ఆపేశాడు: ఎన్టీఆర్‌

Sun,May 20, 2018 09:06 AM
ntr shares his memories with his son

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి. నెల రోజుల ముందు నుండే అభిమానులు ఎన్టీఆర్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటున్నారు. అయితే ఈ రోజుతో 35వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్‌కి అభిమానులు, సెల‌బ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కొన్ని ప్రాంతాల‌లో అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు, పుస్త‌కాల పంపిణీ వంటి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. గత ఏడాది త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా జై ల‌వ‌కుశ చిత్రానికి సంబంధించి రెండు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసి అభిమానుల‌లో ఆనందం ప‌తాక‌స్థాయికి తీసుకెళ్ళిన ఎన్టీఆర్ ఈ బ‌ర్త్‌డేకి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ‘అరవింద సమేత... వీర రాఘవ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల‌కి మాంచి బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు.

ప్ర‌తి ఏడాది త‌న బ‌ర్త్‌డేని కుటుంబ సభ్యుల‌తో జ‌రుపుకునే ఎన్టీఆర్ ఈ ఏడాది కూడా ఫ్యామిలీతో సెల‌బ్రేట్ చేసుకోనున్న‌ట్టు తెలుస్తుంది. అయితే గ‌త ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అభ‌య్ త‌న‌కి ఫ‌స్ట్ బ‌ర్త్‌డే విషెస్ చెప్పాడ‌ని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. పోయిన సంవ‌త్స‌రం అభయ్ రామ్ క‌ళ్లు మూసి త‌న‌కి బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌గా, ఈ సారి మాత్రం అలా చేయ‌లేద‌ని అన్నాడు `ఎట్ట‌కేల‌కు.. అభ‌య్ నా క‌ళ్లు మూయడం ఆపేశాడు. అభ‌య్ పెద్ద‌వాడవుతున్నాడు. అయిన‌ప్ప‌టికీ ఎప్ప‌టిలా నాకు మొద‌ట బ‌ర్త్‌డే విషెస్ చెప్పాడు` అని ఎన్టీయార్ ట్వీట్ చేశాడు. పోయిన సంవ‌త్స‌రం మాదిరిగానే ఈ సంవ‌త్స‌రం కూడా ఎన్టీఆర్ త‌న కుమారుడిని భుజాల‌పైకి ఎక్కించుకున్న ఫోటోని షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ రెండు ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం త‌ర్వాత త‌న బాధ్య‌త చాలా పెరిగింద‌ని భావిస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీతోనే ఎక్కువ టైం కేటాయిస్తున్న సంగ‌తి తెలిసిందే.


6615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles