కొండంత బ‌లం అందించిన అంద‌రికి ధ‌న్య‌వాదాలు: ఎన్టీఆర్

Fri,October 12, 2018 08:15 AM

జూనియ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం అర‌వింద స‌మేత రికార్డుల వేట మొద‌లు పెట్టింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న విడుద‌లైన ఈ చిత్రం ఎన్టీఆర్ గ‌త చిత్రం జై ల‌వ‌కుశ రికార్డుల‌ని తిరగరాస్తుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఫ్యాక్ష‌న్ డ్రామా చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు అభిమానుల ఆద‌రాభిమానాలు అందుకుంటుంది. తొలి షో నుండే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలో కొండంత ధైర్యాన్ని అందించిన అభిమానుల‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. అదే విధంగా చిత్ర‌యూనిట్‌కి, మీడియాకి , సినిమాని స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్ చెప్పారు ఎన్టీఆర్‌. చిన‌బాబు, పూజా హెగ్డే, జ‌గ‌ప‌తి బాబు, థ‌మ‌న్, పెంచ‌ల్ దాస్, వినోద్‌, నవీన్ చంద్ర‌, రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ ఇలా ప్ర‌తి ఒక్క‌రు సినిమాని త‌మ భుజాల‌పై మోసి ఇంత‌టి విజ‌యాన్ని అందించారు. ముఖ్యంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ లేక‌పోతే ఈ విజ‌యం సాధ్యం కాద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
4638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles