బిగ్ బాస్ 2 ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డా ?

Sun,February 18, 2018 11:43 AM
ntr not showing interest on big boss2

వెండితెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో బుల్లితెర‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో భారీ స్థాయిలో రేటింగ్ రాబ‌ట్టింది. ముఖ్యంగా ఎన్టీఆర్ యాంక‌రింగ్‌కి అంద‌రు ఫిదా అయ్యారు. స‌రైన టైమింగ్‌లో పంచ్‌లు విసురుతూ, కామెడీతోను కిత‌కిత‌లు పెట్టించారు ఎన్టీఆర్‌. బిగ్ బాస్ షో హోస్ట్ చేసినందుకు ఎన్టీఆర్ భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌నే టాక్ కూడా న‌డిచింది. జూలై నెల‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్‌2ని కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ఎన్టీఆర్ ఈ షో కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ తో క‌లిసి ఓ ప్రాజెక్ట్ చేయ‌నుండ‌గా, కొద్ది రోజుల త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టారర్ చేయ‌నున్నాడు. ఇవీ కాక తార‌క్‌కి కొన్ని ప‌ర్స‌న‌ల్ క‌మిట్‌మెంట్స్ కూడా ఉన్నాయ‌ట‌. ఇంత బిజీ షెడ్యూల్ కార‌ణంగా బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎన్టీఆర్ నో చెప్పే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. కాని బిగ్ బాస్ నిర్వాహ‌కులు మాత్రం ఎక్కువ మొత్తం ఇచ్చి అయిన ఎన్టీఆర్‌తోనే ఆ ప్రోగ్రాం హోస్ట్ చేయించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. చూడాలి మ‌రి దీనిపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో.

1781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS