ఎన్టీఆర్ చాలా మారిపోయాడే..!

Tue,January 16, 2018 12:52 PM
ntr new look goes viral

పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయిన సరే సై అనే వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. కెరీర్ లో వైవిధ్యమైన సినిమాలు చేసిన ఎన్టీఆర్ రీసెంట్ గా జై లవకుశ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో మూడు పాత్ర లు చేసి మెప్పించిన జూనియర్ త్వరలో త్రివిక్రమ్ తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడని వార్త‌లు వ‌చ్చాయి. కాని అందుకు స‌రైన ప్రూఫ్ దొర‌క్క అభిమానులు క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో జిమ్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోని ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్టీఆర్‌ నిన్న నాకు పతంగులు ఎలా ఎగురవేయాలో నేర్చించారు’ అని ట్వీట్‌ చేశారు. ట్రైన‌ర్ పోస్ట్ చేసిన ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్లిమ్‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. గ‌డ్డం మిన‌హాయిస్తే దాదాపుగా బృందావనం నాటి లుక్ లోకి మారిపోయాడు జూనియర్‌. ఆది- సింహాద్రి టైంలో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ తర్వాత కంత్రి, యమదొంగ సినిమాలలో పూర్తి స్లిమ్ గా మారి కనిపించాడు. ఇక ఈ మధ్య మళ్ళీ కాస్త ఒళ్ళు చేసినట్టు కనిపిస్తున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టొరీగా త్రివిక్రమ్ తెరకెక్కించనున్న సినిమాలో ఎన్టీఆర్ యంగ్ లుక్ లో కనిపించాలట. అందుకోసం జూనియర్ భారీ వర్క్ అవుట్స్ చేసి ఫుల్ స్లిమ్ గా అయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతున్న ఎన్టీఆర్ , త్రివిక్రమ్ మూవీతో సరికొత్త సంచలనం సృష్టించాలని భావిస్తున్నాడట.

3674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS